subhodayam.news
Newspaper Banner
Date of Publish : 02 August 2026, 4:43 pm Digital Edition : Narendhar

బాల్కొండలో ఘనంగా సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలు

బాల్కొండ: బాల్కొండ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ జన్మదిన వేడుకల్లో బాల్కొండ పట్టణ అధ్యక్షుడు సంజీవ్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు చాట్ల నరేష్, కార్యదర్శి మహమ్మద్ యునుస్, బాల్కొండ ఉపసర్పంచి గాండ్ల రాజేందర్, వేల్పూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఇమ్రాన్ ఖాన్,కాంగ్రెస్ పార్టీ నాయకులు పుప్పాల విద్యా సాగర్, వార్డు సభ్యులు పిట్ల దయాకర్,మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ లు సయ్యద్      మజారుద్దీన్, మహమ్మద్ అన్వర్,నాయకులు గడ్డం రవి, దోన్పాల్ సాయన్న,జక్క పద్మారావు,బరిగేడి మల్లేష్ యాదవ్, షేక్ ఆరిఫ్,తదితరులు పాల్గొన్నారు.