subhodayam.news
Newspaper Banner
Date of Publish : 31 July 2026, 10:58 am Digital Edition : Jindham Narahari

తొర్లికొండ జ్ఞానేశ్వర స్వామి ఆశ్రమంలో గురు పౌర్ణమి  వేడుకలు…

జక్రాన్ పల్లి మండలంలోని తొర్లికొండ గ్రామంలో గల జ్ఞానేశ్వర్ స్వామి ఆశ్రమంలో గురుపౌర్ణిమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురూజీ శ్రీ శ్రీ కృష్ణ హరే స్వామికి భక్తులు పాదపూజ చేసి తరించారు.ఈ కార్యక్రమంలో ముంబై నుండి తెలంగాణలోని చుట్టు ప్రక్కల మండలాలు, జిల్లాల నుండి భక్తులు తండోప తండాలుగా తరలివచ్చి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొక్కుల విద్యాసాగర్ (గతంలో ఐడియా సంస్థల అధినేత) మాట్లాడుతూ జీవితం క్షణభంగురమని, భగవద్గీత, వేదాలు,ఉపనిషత్తులు, ఇతిహాసాల సారమే జీవన వేదమని,ఋషులు, జ్ఞాన యోగులు,స్వాములు చెప్పిన ప్రవచనాలను వింటూ జీవితాన్ని సన్మార్గంలో నడపడానికి ప్రయత్నించాలన్నారు.ప్రతీ ఒక్కరూ భక్తి తత్పరతతో మెలిగి ఆచార వ్యవహారాలతో మంచిని పెంచి మమతను నింపి మానవతా విలువలతో జీవించాలన్నారు. ఈ కార్యక్రమంలో రాజు శర్మ, ఐడియా సాగర్ – విజయలక్ష్మి,అల్జాపూర్ రవి, రామచందర్,స్వామిజీలు వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.