గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా పల్లకి సేవ
మెండోరా: భారతీయ సంస్కృతిలో గురువుకు అత్యున్నత స్థానం ఉందని, అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞాన మార్గాన్ని చూపే మహనీయుడే గురువని ఆలయ ప్రధాన అర్చకులు ఆనంద్ శర్మ తెలిపారు. ఆషాఢ పౌర్ణమి రోజున జరుపుకునే గురు పౌర్ణమి గురు పరంపరను స్మరించుకునే పవిత్రమైన పర్వదినమని, ఈ రోజున గురువులను పూజించడం ద్వారా విద్య, విజ్ఞానం, ఆధ్యాత్మిక శ్రేయస్సు కలుగుతాయని ఆయన వివరించారు. ఈ సందర్భంగా మెండోరా మండల కేంద్రంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, అలంకరణలు అనంతరం పల్లకి సేవను ఘనంగా నిర్వహించారు. ఈ పల్లకి సేవలో పెద్ద...