అర్హులైన ఏ ఒక్క ఓటరు ఓటు హక్కును కోల్పోవద్దు -ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
మెండోరా: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ ఆర్) ప్రక్రియను పూర్తిస్థాయిలో పారదర్శకంగా నిర్వహించి, అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరు కూడా తమ ఓటు హక్కును కోల్పోకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కోరారు. మంగళవారం మెండోరా, బాల్కొండ, కమ్మర్‌పల్లి, మోర్తాడ్ మండలాల తహసీల్దార్ కార్యాలయాలను సందర్శించిన ఆయన, సంబంధిత తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులతో సమావేశమై ఎస్ ఐ ఆర్ నమోదు ప్రక్రియ పురోగతిని సమీక్షించారు. పోలింగ్ బూత్‌ల వారీగా ఓటర్ల నమోదు, మ్యాపింగ్, డిజిటలైజేషన్, అలాగే డెత్, డబుల్, షిఫ్టెడ్ (ఏ ఎస్ డి) వివరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా...