తొలి ఏకాదశి వైభవం.. శ్రీహరి అనుగ్రహానికి మహా పర్వదినం

మెండోరాలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తజనం మెండోరా: హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన పర్వదినాల్లో తొలి ఏకాదశికి విశిష్ట స్థానం ఉంది. ఆషాఢ శుక్ల ఏకాదశిని తొలి ఏకాదశి లేదా దేవశయన ఏకాదశిగా పిలుస్తారు. ఈ రోజు నుంచి శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి ప్రవేశిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ పవిత్ర దినాన ఉపవాస దీక్షలు ఆచరించి, విష్ణు సహస్రనామ పారాయణం, భజనలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తే పాప విమోచనం కలిగి, ఐశ్వర్యం, ఆరోగ్యం, సుఖశాంతులు ప్రసాదిస్తాడని భక్తుల విశ్వాసం. చాతుర్మాస దీక్షలు కూడా ఈ రోజునే ప్రారంభమవుతాయి. ఈ సందర్భంగా మెండోరా మండల కేంద్రంలోని శ్రీ కళ్యాణ...