subhodayam.news
Newspaper Banner
Date of Publish : 23 July 2026, 11:40 am Digital Edition : Narendhar

కిసాన్ నగర్ లో మహిళా భవనం పనులు ప్రారంభం

బాల్కొండ: బాల్కొండ మండలం కిసాన్ నగర్ లో మహిళా భవనం పనులను గురువారం సర్పంచ్ రామరాజు గౌడ్ స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ జి ఎస్ నిధులు 10 లక్షల రూపాయలతో భవనం నిర్మాణం పనులు చేపడుతున్నట్లు ఆయన చెప్పారు. మండల బిఆర్ఎస్ అధ్యక్షుడు బద్దం ప్రవీణ్ రెడ్డి, లయన్స్ క్లబ్ జోనల్ చైర్మన్ జ్ఞాన సాగర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు చాట్ల నరేష్, కపిల్, గంగాధర్, బిఆర్ఎస్ నాయకులు షేక్ రహీముద్దీన్, ప్రసాద్ రావు, శరత్, ఉప సర్పంచ్ స్వామి, ఐకెపి సీసీ సుష్మ, మహిళా సంఘం బాధ్యులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.