బాల్కొండలో సర్ ప్రోగ్రాంను పరిశీలించిన ఇంచార్జ్

బాల్కొండ: రాష్ట్ర ఎన్నికల సంఘం చేపట్టిన సర్ ప్రోగ్రాం ను బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సర్ కార్యక్రమం ఇన్చార్జ్ వరప్రసాద్ పరిశీలించారు ‌. ఆయన అంతకుముందు బాల్కొండలో మండలంలోని ఆయా గ్రామాల బూతు ఇంచార్జ్లతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు ‌. అనంతరం 13వ వార్డులో సర్ కార్యక్రమాన్ని పరిశీలించారు. అర్హులైన అందరి ఓట్లు ఉండే విధంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కృషి చేయాలని ఆయన సూచించారు. ఆయన వెంట జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు చాట్ల నరేష్, పార్టీ నాయకులు వెంకటేష్ గౌడ్, కుందారపు శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి యూనూస్, రియాజ్ తదితరులు ఉన్నారు.