బాల్కొండలో జాతీయ పతాక స్వీకరణ దినోత్సవం
బాల్కొండ: బాల్కొండలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జూలై 22న జాతీయ పతాక స్వీకరణ దినోత్సవం ఘనంగా జరిగింది. భారత రాజ్యాంగ సభ 1947 జూలై 22న త్రివర్ణ పతాకాన్ని అధికారికంగా ఆమోదించిన చారిత్రక సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ, పాఠశాల ఆవరణలో ఉపాధ్యాయులు, విద్యార్థులు జాతీయ జెండాను చేత భూని దేశభక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్ మాట్లాడుతూ విద్యార్థులకు జాతీయ జెండా ప్రాముఖ్యతను, దాని రూపకల్పనను మరియు మన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను వివరించారు. ఇలాంటి ఉత్సవాలు పిల్లల్లో విద్యార్థుల్లో జాతీయ భావాన్ని రగల్చడానికి ఎంతగానో ఉపకరిస్తాయి అన్నారు జాతీయ పతాక రూపశిల్పి అయినటువంటి...