subhodayam.news
Newspaper Banner
Date of Publish : 17 July 2026, 10:03 pm Digital Edition : Narendhar

వానల కోసం శ్రీ వెంకటేశ్వర హైస్కూల్ విద్యార్థుల తపన

బాల్కొండ: ఎల్ నినో ప్రభావం వల్ల వర్షాలు లేక తల్లడిల్లి పోతున్న తరుణంలో వర్షాలు కురియాలని, రైతాంగాన్ని ఆదుకోవాలని బాల్కొండ మండల కేంద్రంలో ని శ్రీ వెంకటేశ్వర హైస్కూల్ విద్యార్థులు వానమ్మ కోసం చిరు నృత్య రూపకాన్ని ప్రదర్శించారు. గతంలో గ్రామ గ్రామాల్లో వర్షాల కోసము చిన్న పెద్ద అందరూ కప్పతల్లి ఆటపాటలను ఆడేవారు. అంతరించిపోతున్న  సంస్కృతి, సంప్రదాయాలను గుర్తుచేస్తూ వెంకటేశ్వర హైస్కూల్ విద్యార్థులు చేసిన  నృత్యం పలువురికి ఆహ్లాద చిరుజల్లులని అందించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులను పాఠశాల కరస్పాండెంట్ కే రామలక్ష్మి, హెడ్మాస్టర్ కే సుబ్బారెడ్డిలు అభినందించారు.