శ్రీరామ్ సాగర్ లో గోదావరి పుష్కర ఏర్పాట్లను పరిశీలించిన సిపి చైతన్య
బాల్కొండ: వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని పోచంపాడు ప్రాజెక్టు మరియు పుష్కర ఘాట్లను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య పరిశీలించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత వచ్చే సంవత్సరంలో నిర్వహించనున్న గోదావరి పుష్కరాల సందర్భంగా భక్తులకు మెరుగైన భద్రత , ట్రాఫిక్ నియంత్రణ , రద్దీ నిర్వహణతో పాటు అన్ని రకాల సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో జిల్లా పోలీసు యంత్రాంగం నడుం బిగించింది. గురువారం నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మెండోరా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పోచంపాడు (శ్రీరాంసాగర్ ప్రాజెక్టు) మరియు పుష్కర ఘాట్లను క్షేత్రస్థాయిలో సిపి పరిశీలించారు. ఈ సందర్భంగా పుష్కర ఘాట్ల నిర్మాణ...