subhodayam.news
Newspaper Banner
Date of Publish : 16 July 2026, 6:22 pm Digital Edition : Jindham Narahari

ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని 31 వ వార్డు బీఎల్వో నర్మద సేవలు స్ఫూర్తిదాయకం…

ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని 31 వ వార్డులో 72 వ పీ.ఎస్ ఇంచార్జ్ బీఎల్వో నర్మద తన 60 ఏళ్ల వయస్సులో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సర్ ఓటరు నమోదు కార్యక్రమాన్ని తన పరిధిలోని ప్రతి గడపగడపకు తిరుగుతూ సర్ ఓటర్ జాబితా దరఖాస్తులను అందజేశారు.ఎంతో ఓపికతో ఓటర్ల నమోదు కొరకు అహోరాత్రులు శ్రమ పడుతూ ప్రతీ ఓటర్ కు కాల్ చేస్తూ,ఆన్లైన్ చేయిస్తూ ఇప్పటివరకు 80 శాతం పనిపూర్తి చేయడం జరిగింది. ఆమె యొక్క సేవలను గుర్తించి కాలనీవాసులు శాలువతో సత్కరించి ఆమె సేవలను అభినందించారు.చేనేత డైరెక్టర్,కాలనీ పెద్ద కొంగి రాములు మాట్లాడుతూ ఇతర బీఎల్వో లకు నర్మద సేవలు స్ఫూర్తిదాయకమన్నారు.