జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం…
ఆర్మూర్: జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ లో గల సెయింట్ ఆన్స్ స్కూల్ లో ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఆర్.బి.ఎస్.కె మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సంతోష్ కుమార్ మాట్లాడుతూ 1 నుండి 19 సంవత్సరాల వయస్సు గల పిల్లలు, నులిపురుగుల నివారణ కోసం ఆల్బెండాజోల్ మాత్రలు తప్పకుండా తీసుకోవాలని సూచించారు. వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా పిల్లల్లో నులిపురుగుల సమస్యను నివారించడం, రక్తహీనత తగ్గించడం, పోషకాహార మెరుగుపరచడం, శారీరక మరియు మానసిక ఎదుగుదలకు తోడ్పడడం ప్రధాన లక్ష్యం.మండలం లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు మరియు...