ఆర్మూర్: జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ లో గల సెయింట్ ఆన్స్ స్కూల్ లో ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఆర్.బి.ఎస్.కె మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సంతోష్ కుమార్ మాట్లాడుతూ 1 నుండి 19 సంవత్సరాల వయస్సు గల పిల్లలు, నులిపురుగుల నివారణ కోసం ఆల్బెండాజోల్ మాత్రలు తప్పకుండా తీసుకోవాలని సూచించారు. వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా పిల్లల్లో నులిపురుగుల సమస్యను నివారించడం, రక్తహీనత తగ్గించడం, పోషకాహార మెరుగుపరచడం, శారీరక మరియు మానసిక ఎదుగుదలకు తోడ్పడడం ప్రధాన లక్ష్యం.మండలం లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు మరియు ఆరోగ్య కేంద్రాల ద్వారా అర్హులైన ప్రతి చిన్నారికి ఆల్బెండాజోల్ మాత్రలు అందజేయడం జరిగిందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆల్బెండాజోల్ మాత్రలు తప్పనిసరిగా వేయించి, జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సోమవారం తీసుకొని పిల్లలు వచ్చే సోమవారం నాడు తప్పకుండా తీసుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రంలో ఆరోగ్య కార్యకర్తలు జక్కుల మోహన్, జ్యోతి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సిస్టర్ సుమలత మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.