భీంగల్ :భీంగల్ మండలం గోనుగొప్పుల తండావాసి (ప్రస్తుతం లండన్ లో ఉద్యోగం) అయినా కేలావత్ రాజకుమార్ తన పుట్టినరోజున పలు నిరుపేద కుటుంబాలకు నెలకు సరిపడా నిత్యవసరుకులు పంపిణీ చేసి, తన పుట్టినరోజును అందరిలా ఆడంబరాలు, హంగులు, విందులు, వినోదాలు లేకుండా వినూత్న రీతిలో జరుపుకొని యువతకు ఆదర్శంగా నిలిచాడు. పలు గ్రామాల్లో పేదవారికి, ఇటీవల లింబాద్రిగుట్ట కాలనీకి చెందిన చిన్నారులు నీటి గుంటలో పడి చనిపోయిన కుటుంబాలకు కూడా నిత్యవసర వస్తువులు అందించారు. ఈ పంపిణీ కార్యక్రమంలో రాజకుమార్ స్నేహితులు ధైడి.సురేష్, ఖలీమ్, అతిక్, నవీద్ భాయ్, జుబేర్లు,లు పాల్గొని తమ వంతు కృషి చేశారు.