నా రక్తం తీసుకోండి… పొలాలకు నీళ్లు ఇవ్వండి_మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి
నా రక్తం తీసుకోండి....రైతులకు కాళేశ్వరం నీళ్లివ్వండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి విజ్ఞప్తి చేస్తూ ముప్కాల్ పంపు హౌజ్ సాక్షిగా రక్తం ఇచ్చి వినూత్న నిరసనను మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేసారు. కేసీఆర్ కట్టిన పంప్ హౌస్‌లు సిద్ధంగా ఉన్నాయి.. రేవంత్ రెడ్డి బేషజాలు వీడి కన్నెపల్లి బటన్ నొక్కి కాళేశ్వరం జలాలతో వరద కాలువ ద్వారా ఎస్సారెస్పీని నింపాలి SRSP లో 15 టీఎంసీల నీరున్నా రైతులకెందుకు నీరు ఇవ్వరు?...ఎస్సారెస్పీ నుండి తక్షణమే 4 టీఎంసీల నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని ఆయన కోరారు. వరద కాలువ, కాకతీయ కాలువ,లక్ష్మి కెనాల్,గోదావరి, ప్యాకేజీ-21 మెంట్రాజ్ పల్లి...