మిత్రుడికి అండగా ఎస్ఎస్సి క్లాస్‌మేట్స్.. రూ.10 వేల ఆర్థిక సాయం

(శుభోదయం.న్యూస్-మెండోర ) స్నేహితులంటే కల్లబొల్లి కబుర్లు చెప్పి తప్పించు కొనే బ్యాచ్ కు విరుద్ధమని నిరు పించి ఆదర్శంగా నిలిచారు ఈ స్నేహితులు... మెండోరా మండల కేంద్రానికి చెందిన దాసరి నరేష్ తండ్రి ఇటీవల గుండెపోటుతో మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ విషాద సమయంలో తమ మిత్రుడికి అండగా నిలిచిన ఎస్ఎస్సి క్లాస్‌మేట్స్ ఆర్థిక సహాయంగా రూ.10,000లను అందజేశారు. ఈ సందర్భంగా కష్టకాలంలో మిత్రుడికి తోడుగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని వారు పేర్కొన్నారు. స్నేహబంధానికి నిదర్శనంగా ఈ సహాయం అందించిన క్లాస్‌మేట్స్‌ను కుటుంబ సభ్యులు అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాల నరేష్, బద్ధం అశోక్, చిట్టెడు రమేష్,...