మిస్సింగ్ కేసు విషాదాంతం.. అనారోగ్యంతో వ్యక్తి మృతి
మెండోరా: మెండోరా మండలం వెల్గటూర్ గ్రామానికి చెందిన ఏలేటి నర్సారెడ్డి (35) ఈ నెల 9వ తేదీ రాత్రి ఇంటి నుంచి వెళ్లిపోవడంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. విచారణలో నర్సారెడ్డి అతిగా మద్యం సేవించే అలవాటు ఉండి, ఫిట్స్‌తో బాధపడుతున్నట్లు తెలిసింది. మద్యం వ్యసనం, అనారోగ్య సమస్యలు మరియు మతిస్థిమితం సరిగా లేకపోవడం వల్ల ఇంటి నుంచి వెళ్లిపోయి అనారోగ్యంతో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్సై జాదవ్ సుహాసిని తెలిపారు.