బాల్కొండ: బాల్కొండ మండల కేంద్రంలోని శివ శంకరవాడలో బట్టు లక్ష్మి ప్రభుత్వ సహాయం ద్వారా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇల్లును శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రారంభించి గృహ ప్రవేశం చేశారు.ఈ సందర్భంగా వారూ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో నిరు పేదలకు గృహ నిర్మాణం కోసం రూ5 లక్షలు మంజూరు చేస్తున్నారని వారు తెలిపారు.అర్హులందరికీ దశల వారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అవుతున్నాయని వారు తెలిపారు.ఈ సందర్భంగా లబ్ధిపొందిన వారు మంజూరు చేయించిన బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ సునీల్ కుమార్ రెడ్డి,రాష్ట్ర ఖనిజాఅభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనీల్, యూనియన్ కో-ఆపరేటివ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి లకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు సంజీవ్ గౌడ్,బాల్కొండ ఉపసర్పంచి గాండ్ల రాజేందర్,డీసీసీ కార్యదర్శి మహమ్మద్ యూనిస్,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తౌట్ అరవింద్,వేల్పూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఇమ్రాన్ ఖాన్,పార్టీ నాయకులు కుందారం శ్రీనివాస్, పుప్పాల విద్యా సాగర్, వార్డు సభ్యులు పిట్ల దయాకర్, పుల్లాయి నవీన్ కుమార్, దోన్ పాల్ సాయన్న,గడ్డం రవి,బండి మల్లేష్ యాదవ్,మెట్టు అశోక్,తదితరులు పాల్గొన్నారు.