డాక్టర్ శ్రేయ కు సన్మానం

బాల్కొండ : బాల్కొండ పట్టణ కేంద్రంలో డాక్టర్స్ దినోత్సవం సందర్భంగా ప్రూడెన్స్ హాస్పిటల్ లో గల డాక్టర్ శ్రేయ ను కాంగ్రెస్ నాయకులు శాలువా కప్పి సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాల్కొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సంజీవ్ గౌడ్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు చాట్ల నరేష్, జక్క పద్మారావు, శ్రీ వర్ధన్, సంతోష్ గౌడ్,రమేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.