subhodayam.news
Newspaper Banner
Date of Publish : 30 June 2026, 8:36 pm Digital Edition : Narendhar

నిబంధనలు అతిక్రమిస్తే వాహనం సీజ్ – ఎస్సై కే శైలేందర్ హెచ్చరిక

బాల్కొండ :బాల్కొండ మండలంలోని కిసాన్ నగర్ గ్రామంలో ఎస్సై కే శైలేందర్ ఆధ్వర్యంలో ప్రజలకు ట్రాఫిక్ నిబంధనల పైన అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ వాహనాలు నడిపేటప్పుడు మద్యం సేవించ రాదని, అలాగే హెల్మెట్ ధరించి వాహనం నడపాలని సూచించారు.నిబంధనలకు విరుద్ధంగా వాహనాలను నడిపితే కఠిన చర్యలు తప్పవన్నారు.అలా చేస్తే ఎఫ్ ఐ ఆర్ ఫైల్ చేసి వాహనాన్ని సీజ్ చేసే ఉత్తర్వులు జారీ అయ్యాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రామ్ రాజ్ గౌడ్,సిబ్బంది నరేష్,భాస్కర్,శంకర్, ప్రజలు పాల్గొన్నారు.