మాణిక్యం ఠాగూర్ ను అభినందించిన మోహన్ రెడ్డి , వెంకటేష్ గౌడ్

తమిళనాడు పీసీసీ అధ్యక్షులుగా పార్లమెంట్ సభ్యులు మాణిక్యం ఠాగూర్ నియమితులైన సందర్భంగా ఢిల్లీలోని వారి నివాసంలో తెలంగాణ కోపరేటివ్ యూనియన్ చైర్మన్ శ్రీ మానాల మోహన్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు గున్నాల వెంకటేష్ గౌడ్ లు మర్యాదపూర్వకంగా కలుసుకుని, శాలువాతో సన్మానించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసారు . ఈ సందర్భంగా శ్రీ మాణిక్యం ఠాగూర్ నూతన బాధ్యతలు విజయవంతంగా నిర్వహించాలని ఆకాంక్షిస్తూ, వారి సమర్థ నాయకత్వంలో తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం చెంది ప్రజల విశ్వాసాన్ని చూరగొంటుందని ఆశాభావం వారు వ్యక్తం చేశాము.