subhodayam.news
Newspaper Banner
Date of Publish : 23 June 2026, 6:31 pm Digital Edition : Narendhar

మాజీమంత్రి ప్రశాంత్ రెడ్డి గృహ నిర్బంధం అక్రమం

బాల్కొండ: రైతులను కన్నీళ్లు పెట్టిస్తున్న ‘యూరియా యాప్‌’ను వెంటనే రద్దు చేయాలనే డిమాండ్‌తో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో తలపెట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి బయలుదేరిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ని హౌస్ అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బాల్కొండ మండల కోఆప్షన్ నెంబర్ షాహిద్ ఒక ప్రకటనలో తెలిపారు.

రైతులకు యూరియా సరఫరా చేయడంలో పూర్తిగా చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, తన నిరంకుశ విధానాలతో ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూడడం అత్యంత అవివేకమని ఇలాంటి అప్రజాస్వామిక చర్యలతో ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను ఎంతమాత్రం నిలువరించలేదు. రాబోయే రోజుల్లో అన్నదాతల ఆగ్రహం ఉప్పెనగా మారి ఈ నిరంకుశ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం ఖాయమని ఆయన అన్నారు.

ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి తక్షణమే ‘యూరియా యాప్’ను రద్దు చేయాలని, పాత విధానంలోనే రైతులకు అవసరమైనంత యూరియా అందించాలని BRS Party పక్షాన షహీద్ డిమాండ్ చేసారు.