subhodayam.news
Newspaper Banner
Date of Publish : 20 June 2026, 2:52 pm Digital Edition : Narendhar

మార్కండేయ మందిరాన్ని సందర్శించిన దేవాదాయశాఖ ఇన్స్పెక్టర్

బాల్కొండ: బాల్కొండ మండల కేంద్రంలోని అత్యంత పురాతనమైన శతాబ్దాల క్రితము స్థాపితమైన మార్కండేయ మందిరం పునర్నిర్మాణ పనులు చేపట్టడానికి అవసరమైన ఎస్టిమేట్, తదితర లాంచన కార్యక్రమాలను ముందుకు నడిపించడానికి నిజాంబాద్ జిల్లా దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ సుజాత రెడ్డి శనివారం ఆలయాన్ని సందర్శించారు. ఆలయ విశిష్టత, శివాలయం , నరనారాయణ ఆలయ విశిష్టతలను ఆమెకు బాల్కొండ పద్మశాలి సంఘం అధ్యక్షుడు అంద వెంకటగిరి, కోశాధికారి కుందారపు శ్రీనివాస్ లు వివరించారు. కార్యక్రమంలో పలువురు సంఘం సభ్యు లు పాల్గొన్నారు.