బాల్కొండ :మండలంలోని జలాలపూర్ గ్రామంలో గురువారం ముధోల్ బోస్లే గోపాలరావు కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు ఈ శిబిరంలో జలాల్పూర్, ఇత్వర్ పేట్, కోమన్ పల్లి, గ్రామాలకు చెందిన ప్రజలు వైద్య శిబిరంలో పాల్గొని ఉచిత నేత్రవైద్య పరీక్షలు నిర్వహించుకున్నారు సుమారు 150 మంది వరకు రోగులు హాజరయ్యారు ఇందులో మోతి బిందు, శుక్లాలు,తదితర కంటి జబ్బులు సంబంధించిన వైద్య పరీక్షలను ముధోల్ కంటి ఆస్పత్రి వారు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు అయితే సుమారు 53మంది వరకు రోగులకు కంటి శాస్త్ర చికిత్స అవసరం ఉందని వైద్యులు గుర్తించారు వీరికి ఉచితంగానే శస్త్రచికిత్స లునిర్వహిస్తామని ఆసుపత్రి ప్రతినిధులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జి. సర్పంచ్ మోహన్ రెడ్డి, వైద్యులు శేషు ,పర్యవేక్షకులు దేబసిన్ ,గంగాధర్,క్యాంపు సూపర్వైజర్ పెండెల లక్ష్మన్, విట్టల్ విడిసి అధ్యక్షుడు కిషన్,సుధాకర్, రాజేందర్ గౌడ్,రాజన్న,సురేష్,దశరథ్, ప్రదీప్, రవి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు