subhodayam.news
Newspaper Banner
Date of Publish : 08 June 2026, 7:36 am Digital Edition : jindham narahari

ఎన్ని ఒడిదుడుకులెదురైనా న్యాయవాద వృత్తిలో మేటిగా నిలిచిన చిల్క కిష్టయ్య జీవన ప్రస్థానం…

కమ్మర్ పల్లి వాస్తవ్యులు ఆర్మూర్ లో సీనియర్ న్యాయవాది చిలుక కిష్టయ్య జీవన ప్రస్థానం…అమ్మ బీడీలు చుట్టి,నాన్న బీడీల గంప ఊరూరా తిరుగుతూ బీడీలు అమ్ముతూ కష్టపడి పిల్లలను చదివిస్తూ కొన్ని రోజుల తర్వాత చిల్క లింగన్న బీడీ కంపెనీ పెట్టి సైకిల్ పై లూనా బండి మీద తిరుగుతూ కమ్మరపల్లి మండల చుట్టుప్రక్కల గ్రామాలలో చిన్న చిన్న దుకాణాలలో బీడీలు అమ్ముతున్న సందర్భంగా నేను నాన్నకు చేదోడు వాదోడుగా ఉంటూ బీడీలు దుకాణాలలో సైకిల్ మీద తిరిగి అమ్మేవాడిని ఇలా మా నాన్న రూపాయి రూపాయి కూడబెట్టి పిల్లలను మంచి ఉన్నత స్థాయిలో నిలబెట్టాలని చదివిస్తూ తాను తిన్నా తినకున్నా పస్తులుండి పిల్లల భవిష్యత్తు కొరకు తాపత్రయపడుతూ నేను న్యాయవాద విద్య చదవడానికి కృషి చేసి,కొడుకు లాయర్ కావాలని,కోరుకుంటూ ఉన్నత చదువులు చదువుకోవాలని న్యాయవాద పట్టా చేతికి అందిన తర్వాత ఆర్మూర్ కోర్ట్ లో ప్రాక్టీస్ చేయడానికి వచ్చి ఇక్కడే స్థిరపడ్డాను.అందరినీ పరిచయం చేసుకోవడం అందరితో కలుపుగోలుగా మాట్లాడటం అందరినీ పలకరిస్తూ మొట్టమొదలు ఆర్మూర్ లో అడుగు పెట్టిన తర్వాత ఎవరూ పరిచయం లేకపోవడంతో భారతీయ జనత పార్టీ నాయకుడు బద్దం లింగారెడ్డితో పరిచయం ఏర్పడి,ఆర్ఎస్ఎస్ నేపథ్యంతో ఏబీవీపీ సిద్ధాంతంతో ఆశయాల సాధనకు కృషి చేసేవాడిని,ఆయన నన్ను సీనియర్ న్యాయవాది లోక భూపతి రెడ్డితో పరిచయం చేశారు.ఇలా నా ప్రాక్టీస్ ప్రారంభమైంది.

నేను ఆర్మూర్ కు ఒక టేబుల్,కుర్చీ,ఒక CRPC Book ఒకటే ఉండే ఇలా నా న్యాయవాద వృత్తి ప్రస్థానం జరిగుతోంది.కుటుంబ ఆర్థిక పరిస్థితులు మెల్ల మెల్లగా నెట్టుకొస్తూ బార్ అసోసియేషన్ అన్ని పదవులు సక్రమంగా నిర్వహించడం ద్వారా సీనియర్ న్యాయవాదులతో మరియు తోటి న్యాయవాదులతో మంచి సంబంధం ఏర్పాటు చేసుకొని కీలక అధ్యక్ష పదవిని కూడా సమర్థవంతంగా నిర్వహించడం జరిగింది.అందరి మన్నలను పొందడం కే.ఆర్.సురేష్ రెడ్డి రాజ్యసభ సభ్యులు నాకు ప్యానెల్ అడ్వకేట్ గా ఆంధ్రా బ్యాంకు ఇప్పుడది యూనియన్ బ్యాంకుగా మారింది.నా నియామకానికి చేయూతనివ్వడం జరిగింది. తెలంగాణ ఉద్యమం సమయంలో న్యాయవాదుల తరుఫున అధ్యక్షుడిగా ఉండి ఉద్యమం సమయంలో కూడ తెలంగాణ కొరకు అహర్నిశలు నా వంతుగా కృషి చేసాను.ఇప్పుడు కూడా ప్రాక్టీస్ లో మంచి అడ్వకేట్ గా పేరు తెచ్చుకోవడం జరిగింది. న్యాయాన్ని ధర్మాన్ని చట్టాన్ని కాపాడుతూ న్యాయవాదిగా వందమంది దోషులకు శిక్ష పడినా పరవాలేదు. కానీ ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదని నా ప్రాక్టీస్ చేస్తూ మంచి పేరు తెచ్చు కోవాలని ఆకాంక్షిస్తూ అందరి సహకారంతో ముందుకెళ్లాలని కోరుతున్నానన్నారు.