ఆర్మూర్ పట్టణంలోని రాంనగర్ కు చెందిన విద్యావంతుడు సామాజిక స్పృహ గల సామాజిక సేవకుడు సమాజ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సందర్భోచితంగా స్పందిస్తూ… తన సొంత ఖర్చులతో ఎన్నో ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తూ….సమాజ హితవరి, సేవా రత్న అవార్డు గ్రహీత పాన్ ఇండియా జాతీయస్థాయి సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్ తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగిన అవార్డుల ప్రధానోత్సవంలో హిమాచల్ ప్రదేశ్ మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఇతర ప్రముఖుల చేతుల మీదుగా “ప్రపంచ పర్యావరణ దినోత్సవం” సందర్భంగా “పర్యావరణ మిత్ర” అనే జాతీయ పురస్కారం అందుకోవడం జరిగింది.ఈ సందర్భంగా తన ఆత్మీయులు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు. పట్వారి తులసి స్ఫూర్తి ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు.పట్వారి తులసి మాట్లాడుతూ సమాజం కోసం స్పందిస్తూ సేవలందిస్తున్న నాకు వస్తున్నా ఈ అవార్డులు మా మాతృమూర్తి పట్వారి బాల సరస్వతీ మాతకు అంకితం చేస్తున్నానన్నారు. మా అమ్మ ప్రేరణతో సమాజంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో స్ఫూర్తిని, చైతన్యాన్ని నింపుతూ ముందుకు వెళ్తానని అందరి ఆశీస్సులు నాపై ఉండాలని వేడుకున్నారు.


