బాల్కొండ ( శుభోదయం. న్యూస్): జలాల్పూర్ గ్రామంలో శనివారం సర్పంచ్ గుండేటి మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన గ్రామసభ నిర్వహించడం జరిగినది. ఇట్టి గ్రామసభలో వర్షాకాల సన్నద్ధత , సురక్షిత మంచినీరు,సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, జల సంరక్షణ మన సంరక్షణ,ప్లాంటేషన్ వనమహోత్సవం, వరదలు మరియు భద్రత, SIR, పంట మార్పిడి అంశాలపై అవగాహన కల్పించడం జరిగింది. డిప్యూటీ తాసిల్దార్ , బాల్కొండ ఎస్సై శైలెందర్ పాలకవర్గ సభ్యులు ,పంచాయతీ కార్యదర్శి దేవేందర్ ,GPO శేఖర్ గ్రామసభ సభ్యులు పాల్గొనడం జరిగింది


