భీంగల్ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఎస్ టి వో, తహసీల్దార్లకు సత్కారం…
భీంగల్ మండల కేంద్రంలోని తెలంగాణ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం భీంగల్ శాఖ ఆధ్వర్యంలో నూతనంగా బదిలీపై వచ్చిన నవీన్ సబ్ ట్రెజరీ అధికారిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించడం జరిగింది.విశ్రాంత ఉద్యోగులందరికీ తగిన సహాయ సహకారాలు అందించాల్సిందిగా తెలియజేశారు.ఈ సందర్భంగా ఎస్ టి వో నవీన్ మాట్లాడుతూ విశ్రాంత ఉద్యోగులందరికీ తన వంతు పూర్తి సహాయ సహకారాలు అందజేస్తానని తెలియజేశారు. విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యవర్గ సభ్యులు ఎస్ టి వో కు కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే భీంగల్ మండలానికి నూతనంగా విచ్చేసిన ఎమ్మార్వో ఎం.కిరణ్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించడం జరిగింది .విశ్రాంత ఉద్యోగుల కొరకు...