subhodayam.news
Newspaper Banner
Date of Publish : 06 June 2026, 8:45 am Digital Edition : jindham narahari

భీంగల్ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఎస్ టి వో, తహసీల్దార్లకు సత్కారం…

భీంగల్ మండల కేంద్రంలోని తెలంగాణ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం భీంగల్ శాఖ ఆధ్వర్యంలో నూతనంగా బదిలీపై వచ్చిన నవీన్ సబ్ ట్రెజరీ అధికారిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించడం జరిగింది.విశ్రాంత ఉద్యోగులందరికీ తగిన సహాయ సహకారాలు అందించాల్సిందిగా తెలియజేశారు.ఈ సందర్భంగా ఎస్ టి వో నవీన్ మాట్లాడుతూ విశ్రాంత ఉద్యోగులందరికీ తన వంతు పూర్తి సహాయ సహకారాలు అందజేస్తానని తెలియజేశారు. విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యవర్గ సభ్యులు ఎస్ టి వో కు కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే భీంగల్ మండలానికి నూతనంగా విచ్చేసిన ఎమ్మార్వో ఎం.కిరణ్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించడం జరిగింది .విశ్రాంత ఉద్యోగుల కొరకు పెన్షనర్ భవనము నిర్మించుట కొరకు అవసరమైన స్థలాన్ని కేటాయించ వలసిందిగా ఎమ్మార్వో కు వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో గుమ్ముల గంగాధర్, అధ్యక్షులు. ఎస్ మురారి ,అసోసియేట్ అధ్యక్షులు. బి గంగారాం ఉపాధ్యక్షులు. పల్లికొండ నర్సయ్య, జాయింట్ సెక్రెటరీ. బి రాజేశ్వర్, ఆర్గనైజింగ్ కార్యదర్శి. ఎస్. వెంకయ్య, ప్రచార కార్యదర్శి. మగ్గిడి శంకర్, జిల్లా కౌన్సిలర్ .మరియు కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు