Wednesday, June 10, 2026

వారంలోనే గొలుసు దొంగను పట్టుకున్న మెండోరా పోలీసులు

📰 Generate e-Paper Clip

మెండోరా మండలం నేషనల్ హైవే 44 పైన బుస్సాపూర్ గ్రామంలో ఇటీవల సంచలనం రేపిన చైన్ స్నాచింగ్ సంఘటనలో మెండోరా పోలీసులు ఎట్టకేలకు నిందితుడి ని  వారంలోపే పట్టుకున్నారు. ఆర్మూర్ రూరల్ సిఐ జాన్ రెడ్డి ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

గత శనివారం సోన్పేట్ గ్రామానికి చెందిన ఉప్పరి గణేష్ తన భార్య గంగు, కూతురు మనీషాతో కలిసి ముప్కాల్ నుండి తన టీవీఎస్ ఎక్సెల్ బండి మీద సోన్పేట్‌కు వెళ్తుండగా, సాయంత్రం దాదాపు 4.30 గంటలకు బుస్సాపూర్ శివారులోని ఎన్‌హెచ్-44 రహదారిపై ఒక గుర్తు తెలియని దొంగ ముఖానికి మాస్క్ ధరించి సైకిల్‌పై వచ్చి, వెనుక కూర్చున్న గంగు మెడలోని రెండు తులాల బంగారు పుస్తెల తాడును లాక్కొని పారిపోయాడు.

మెండోరా ఎస్.ఐ సుహాసిని ఆధ్వర్యంలో పోలీసులు నిందితుడి కోసం గాలించి, ఈరోజు అతన్ని పట్టుకున్నారు. దొంగిలించబడిన బంగారాన్ని స్వాధీనం చేసుకుని, నిందితుడిని అరెస్టు చేసి జైలుకు పంపినట్లు ఆర్మూర్ రూరల్ సి.ఐ జాన్ రెడ్డి తెలిపారు. నిందితుడు పంజాబ్ రాష్ట్రానికి చెందిన గుర్జంత్ సింగ్ అని వెల్లడించారు.

నిందితుడిని పట్టుకోవడంలో సహకరించిన ఎస్సై సుహాసిని తో పాటు హెడ్ కానిస్టేబుల్ నరేందర్, కానిస్టేబుల్ భరత్ గౌడ్, లింగన్న, షౌకత్‌లను సి.ఐ జాన్ రెడ్డి అభినందించారు.

Must Read
- Advertisement -
Latest News

“పర్యావరణ మిత్ర” జాతీయ అవార్డు గ్రహీత సేవలను అభినందించి సత్కరించిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి…

ఆర్మూర్ పట్టణంలోని రామ్ నగర్ కు చెందిన సామాజిక సేవకులు జాతీయ అవార్డు గ్రహీత పట్వారి తులసి కుమార్ ఇటీవల మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ...

More Articles Like This