subhodayam.news
Newspaper Banner
Date of Publish : 05 June 2026, 11:47 am Digital Edition : RAJU CH

నిరుద్యోగులకు శుభవార్త …దరఖాస్తుల ఆహ్వానం

మెండోరా: మెండోరా మండలంలోని సోన్‌పేట్, చాకిర్యాల్, బుస్సాపూర్, మెండోరా ప్రాథమిక పాఠశాలల్లో ప్రారంభమైన ప్రీ-ప్రైమరీ పాఠశాలల కోసం ఇన్స్ట్రక్టర్లు, ఆయాల పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు మండల విద్యాధికారి డి. శ్రీనివాస్ తెలిపారు. తాత్కాలికంగా 10 నెలల గౌరవ వేతనం ఆధారంగా ఈ నియామకాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

ఇన్స్ట్రక్టర్ పోస్టులకు ఇంటర్మీడియట్‌తో పాటు టీటీసీ అర్హత ఉండాలని, ఆయా పోస్టులకు ఏడో తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలని తెలిపారు. అభ్యర్థులు సంబంధిత హాబిటేషన్, గ్రామం లేదా మండలానికి చెందిన వారై ఉండాలని, 18 నుంచి 44 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలని సూచించారు.

అర్హులైన అభ్యర్థులు ఈ నెల 6వ తేదీ నుంచి 9వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు సంబంధిత పాఠశాలల్లో దరఖాస్తులు సమర్పించవచ్చని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయని మండల విద్యాధికారి వెల్లడించారు.