subhodayam.news
Newspaper Banner
Date of Publish : 05 June 2026, 9:07 am Digital Edition : jindham narahari

ఘనంగా జిల్లా యువజన కాంగ్రెస్ నాయకుడి జన్మదిన వేడుకలు…

భీంగల్ మండల కేంద్రంలో జిల్లా యూత్ కాంగ్రెస్ యువజన నాయకుడు “విపుల్.గౌడ్” జన్మదిన వేడుకలు ఘనంగా భీంగల్ మండల కేంద్రంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ యువనాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా యువనాయకులు దైడి సురేష్ మాట్లాడుతూ ప్రజాసేవలో యువత ముందుండలని, సమాజ అభివృద్ధికి కృషి చేయాలని నాయకులు ఆకాంక్షించారు.యువ నాయకుడి సేవలను కొనియాడుతూ ఆయన ప్రజలకు మరింత చేరువై పార్టీకి  మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు.