subhodayam.news
Newspaper Banner
Date of Publish : 02 June 2026, 6:34 pm Digital Edition : jindham narahari

జిల్లా సబ్ రిజిస్టార్ కార్యాలయం లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు…

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కవిత కాంప్లెక్స్ లోని సబ్ రిజిస్టార్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా పోలేపల్లి రవీందర్,అసిస్టెంట్ రిజిస్టార్ ఆఫ్ చిట్స్ అండ్ ఆడిటర్ నిజామాబాద్ ఆధ్వర్యంలో కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా పోలేపల్లి రవీందర్ అసిస్టెంట్ సబ్ రిజిస్టర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనకు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా త్యాగం చేసిన అమరవీరులకు ఘన నివాళులు అర్పిస్తూ… తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో రవికాంత్,ప్రసాద్,సతీష్ చంద్రశేఖర్,సాయిలు, వసీయెద్దీన్,శోభారాణి,అనుపమ తదితరులు పాల్గొన్నారు.