మెండోరా పోలీస్ స్టేషన్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
మెండోరా: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మెండోరా పోలీస్ స్టేషన్‌లో ఘనంగా జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై జాదవ్ సుహాసిని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసు సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ, రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆమె పేర్కొన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిందని అన్నారు. జూన్ 2, 2014న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన నేపథ్యంలో ప్రతి సంవత్సరం ఈ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.