subhodayam.news
Newspaper Banner
Date of Publish : 01 June 2026, 6:56 pm Digital Edition : RAJU CH

మెండోరా మండలంలో ఘనంగా 17 ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలు

మెండోరా: మెండోరా మండలంలోని వివిధ గ్రామాల్లో నూతనంగా నిర్మించిన 17 ఇందిరమ్మ ఇండ్లకు ఎంపీడీవో లక్ష్మణ్ ఆధ్వర్యంలో సోమవారం గృహప్రవేశ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో గోలి సత్తెమ్మ, దుంపిడి నాగలక్ష్మి ల నూతన గృహాలను ఘనంగా ప్రారంభించి గృహప్రవేశం నిర్వహించారు.
కార్యక్రమంలో సర్పంచ్ బుట్టడి ప్రమోద్ కుమార్ పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తోందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మిట్టపల్లి రాజేశ్వర్, పంచాయతీ కార్యదర్శి జాకీర్ హుస్సేన్, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.