Wednesday, June 10, 2026

సామాజిక సేవకుడు తులసీ పట్వారి ఆధ్వర్యంలో అధికారులతో యువత పొగాకు, మద్యం, డ్రగ్స్ కు దూరంగా ఉండాలని కరపత్రం ఆవిష్కరణ…

📰 Generate e-Paper Clip

ఆర్మూర్ పట్టణ సామాజిక సేవకులు జాతీయ అవార్డు గ్రహీత పట్వారి తులసి కుమార్ జాతీయ పొగాకు నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ధూమపానం ఇతర చెడు అలవాట్లు పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాటి ప్రభావంతో రూపొందించిన పోస్టర్ ను ఆర్మూర్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ,ఏసీపి వెంకటేశ్వర రెడ్డి, సి ఐ సత్యనారాయణ గౌడ్ ల చేతుల మీదుగా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ నేటి ప్రజలు ధూమపానంకు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని వాటి వల్ల మన శరీరంలో వివిధ రకాల వ్యాధుల ప్రభావం ఉంటుందని హాని కలిగిస్తాయని అన్నారు.ప్రతీ ఒక్కరూ పట్వారీ తులసి సేవలు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఏసీపి వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ పొగాకు,మద్యం, డ్రగ్స్ వంటి అలవాట్ల వల్ల జీవన విధానాన్ని దెబ్బ తీస్తాయన్నారు.ఈ కార్యక్రమంలో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Must Read
- Advertisement -
Latest News

“పర్యావరణ మిత్ర” జాతీయ అవార్డు గ్రహీత సేవలను అభినందించి సత్కరించిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి…

ఆర్మూర్ పట్టణంలోని రామ్ నగర్ కు చెందిన సామాజిక సేవకులు జాతీయ అవార్డు గ్రహీత పట్వారి తులసి కుమార్ ఇటీవల మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ...

More Articles Like This