దేవుని దీపంతో అన్నదమ్ముల ఇళ్లలో అగ్నిప్రమాదం
మెండోరా: మెండోరా మండల కేంద్రంలో ఆదివారం జరిగిన అగ్నిప్రమాదంలో అన్నదమ్ములైన కుమ్మరి రాజరాపు రాజేశ్వర్, రాజరాపు బక్కన్న ఇళ్లలోని గృహోపకరణాలు, నగదు సహా సామగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి. పౌర్ణమి సందర్భంగా ఇంట్లో దేవుని వద్ద దీపం వెలిగించి బక్కన్న భార్య పద్మ బయటకు వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కొద్దిసేపటి తర్వాత ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి, పక్కనే ఉన్న రాజేశ్వర్ ఇంటికి కూడా వ్యాపించాయి. దీంతో రెండు ఇళ్లలో భారీగా మంటలు వ్యాపించి ఆస్తినష్టం సంభవించింది. మంటలను గమనించిన స్థానిక కాలనీవాసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే అప్పటికే రెండు ఇళ్లలోని...