బాధిత కుటుంబాలను పరామర్శించిన సునీల్ కుమార్
మెండోరా: బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఆదివారం మెండోరా మండలంలోని పలు గ్రామాల్లో ఇటీవల కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధిత కుటుంబాలను పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మండలంలోని సావెల్ గ్రామానికి చెందిన వడ్డే ఆనంద్ ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందగా, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు. అలాగే అదే గ్రామానికి చెందిన వేల్పుల పెద్ద గంగాధర్ అనారోగ్యంతో మృతి చెందగా, వారి కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పారు. అదేవిధంగా కోడిచెర్ల గ్రామానికి చెందిన పడిగెల రవి భార్య శివరంజని ఇటీవల గుండెపోటుతో మృతి చెందగా, వారి కుటుంబ...