subhodayam.news
Newspaper Banner
Date of Publish : 31 May 2026, 4:36 pm Digital Edition : RAJU CH

బాధిత కుటుంబాలను పరామర్శించిన సునీల్ కుమార్

మెండోరా: బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఆదివారం మెండోరా మండలంలోని పలు గ్రామాల్లో ఇటీవల కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధిత కుటుంబాలను పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మండలంలోని సావెల్ గ్రామానికి చెందిన వడ్డే ఆనంద్ ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందగా, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు. అలాగే అదే గ్రామానికి చెందిన వేల్పుల పెద్ద గంగాధర్ అనారోగ్యంతో మృతి చెందగా, వారి కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పారు.

అదేవిధంగా కోడిచెర్ల గ్రామానికి చెందిన పడిగెల రవి భార్య శివరంజని ఇటీవల గుండెపోటుతో మృతి చెందగా, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు.

మెండోరా మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు సుమో రాజేశ్వర్ అత్తమ్మ ఏనుగు గంగుబాయి ఇటీవల వడదెబ్బ కారణంగా మృతి చెందగా, వారి కుటుంబ సభ్యులను కలిసి ప్రగాఢ సంతాపం తెలిపారు.

ఈ సందర్భంగా మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ముత్యాల సునీల్ కుమార్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.