మెండోరా మండల విఓఏల సమ్మెకు ఏపీఎం, సీసీల మద్దతు

మెండోరా: నిజామాబాద్ జిల్లా మెండోరా తహసీల్దార్ కార్యాలయం ఎదుట కొనసాగుతున్న విఓఏల సమ్మె నేటితో మూడో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా మండల ఐకేపీ ఏపీఎం గంగరాజు, సీసీలు అన్నపూర్ణ, ప్రణిత, బాల్‌రాజు మరియు మండలంలోని ఓబీలు సమ్మెకు పూర్తి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా మెండోరా విఓఏల మండల అధ్యక్షురాలు కళావతి మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల ముందు విఓఏలకు కనీస వేతనం రూ.26 వేలుగా పెంచుతామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క)...