ఒంటి చేత్తో మంటలార్పిన సర్పంచ్…

ఖద్దరు చొక్కాలు... ఆఫీస్ లో ఫ్యాన్ల కింద బాతఖానిలు... చుట్టూ మంది మార్బలంతో తమ ఉనికిని చాటుకునే ప్రజా ప్రతినిధులు ఉన్న ఈ రోజుల్లో... ప్రజలకు కష్టం వస్తే తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వొంటి చేత్తో అగ్ని మంటలను ఆర్పి వేసిన సర్పంచు ఉదంతమిది. బాల్కొండ పరిసర ప్రాంతాల్లో గత వారం రోజులుగా ఉష్ణోగ్రత 45 నుండి 46 డిగ్రీల పైన ఎండలు ఉంటున్నాయి. ఈ దశలో బాల్కొండ మండలంలోని జలాల్పూర్ పంట పొలాల్లో సోమవారం సాయంత్రం పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. దాదాపు 40 ఎకరాల గడ్డివాములు ఈ అగ్ని కీలలకు ఆహుతి అయ్యాయి. ఈ మంటలు పక్కనే...