మెండోరా: మెండోరా మండలంలోని బుస్సాపూర్ గ్రామంలో 2021లో జరిగిన హత్య కేసులో నిందితుడికి కోర్టు కఠినమైన జీవిత కారాగార శిక్ష విధించింది. కేసు వివరాల ప్రకారం, బుస్సాపూర్ గ్రామానికి చెందిన ఎస్సీ కులస్తుడు సుద్ధపల్లి లింగన్నను నిందితుడు సోమ నవీన్ రెడ్డి గొడ్డలితో దాడి చేసి హత్య చేసిన ఘటనకు సంబంధించి విచారణ చేపట్టిన కోర్టు సోమ నవీన్ రెడ్డిని దోషిగా నిర్ధారించింది.
ఈ కేసును విచారించిన గౌరవ ఎస్సీ/ఎస్టీ రెండో అదనపు జిల్లా మరియు సెషన్స్ న్యాయమూర్తి శ్రీ నారాయణ నిందితుడికి జీవితాంతం కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు.
కేసు విచారణలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీ దయాకర్ గౌడ్ వాదనలు వినిపించారు. ఈ కేసు దర్యాప్తులో అప్పటి ఆర్మూర్ ఏసీపీ రఘు, ఎస్సై శ్రీధర్ రెడ్డి, ఆర్మూర్ రూరల్ సీఐ జాన్ రెడ్డి, లైజనింగ్ అధికారి టి. గోవింద్ సింగ్, కోర్టు కానిస్టేబుళ్లు రాజు, సాగర్, విక్రమ్ తదితరులు కీలకంగా సహకరించినట్లు మెండోరా ఎస్సై సుహాసిని తెలిపారు.