మెండోరా: మెండోరా మండలంలోని సావెల్ గ్రామానికి చెందిన ఆలకుంట ఆనంద్, ఆలకుంట సురేష్, దేశెట్టి చిన్నయ్యలు ఆదివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో చేపలు పట్టేందుకు గోదావరి నదికి వెళ్లారు. ఈ సందర్భంగా చేపల వేట కోసం కరెంట్ ఉపయోగిస్తున్న క్రమంలో ఆలకుంట ఆనంద్‌కు ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.
మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు మెండోరా ఎస్సై సుహాసిని తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు విచారణలో వెల్లడికానున్నాయని ఆమె పేర్కొన్నారు. ఈ విషాద ఘటనతో సావెల్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.