తెలంగాణ పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ జన్మదినాన్ని పురస్కరించుకొని జంబి హనుమాన్ ఆలయం నందు ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సెల్ పట్టణ అధ్యక్షులు ధోండి రమణ మాట్లాడుతూ మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోందని,పార్టీ బలోపేతం, కార్యకర్తల సంక్షేమం, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఆయన నిరంతరం కృషి చేస్తున్నారు.సాధారణ కార్యకర్త స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన ఆయన రాజకీయ ప్రయాణం యువతకు ఆదర్శంగా నిలుస్తోంది.ప్రజల ఆశయాలను నెరవేర్చే దిశగా, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను గ్రామ గ్రామానికీ తీసుకెళ్తూ, ప్రజాసేవే పరమావధిగా ముందుకు సాగుతున్న మహేష్ కుమార్ గౌడ్ కు హృదయపూర్వక అభినందనలు. ఆయన నాయకత్వంలో తెలంగాణ మరింత అభివృద్ధి పథంలో దూసుకుపోవాలని ఆకాంక్షిద్దామన్నారు.వీరితోపాటు ఆలయ కమిటీ సభ్యులు నూతుల నారాయణ, జంగిడి భోజన్న,చిట్యాల నవీన్ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.