మెండోరాలో ఘనంగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు
మెండోరా: మెండోరా మండల కేంద్రంలో ఆదివారం టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడాల సాయిరెడ్డి మాట్లాడుతూ, పార్టీ బలోపేతానికి బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ చేస్తున్న కృషి ప్రశంసనీయమని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి ఆయన నాయకత్వం ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయురారోగ్యాలతో దీర్ఘాయుష్షు కలగాలని ఆకాంక్షించారు. అనంతరం నాయకులు, కార్యకర్తలకు మిఠాయిలు పంపిణీ చేసి జన్మదిన వేడుకలను ఆనందోత్సాహాల...