ఆర్మూర్ పట్టణంలోని బాలుర హై స్కూల్ లో జడ్జి శ్రీదేవి,సబ్ కలెక్టర్ అభినవ్,ఎమ్మార్వో సత్యనారాయణ గౌడ్, ఆర్మూర్ SHO సత్యనారాయణ మరియు లేబర్ ఆఫీసర్ సమక్షంలో 40 మంది బాల కార్మికులకు విముక్తి కలిగించిన కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో బాల కార్మికులకు ఆహార పొట్లాలు, పండ్లు మరియు వాటర్ బాటిల్ అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అఫ్ ఆర్మూర్ సెక్రటరీ ఖాందేశ్ సత్యం, పుష్పకర్ రావు, రాస ఆనంద్, తులసి పట్వరి, ఆత్రేయ నరేష్, తదితరులు పాల్గొన్నారు.