కుల గణనపై సుప్రీంకోర్టు తీర్పుకు స్వాగతం
--ఓబీసీ మహిళలకు సబ్ కోట అమలు చేయాలి : దాసరి మూర్తి దేశవ్యాప్తంగా కుల గణన నిర్వహణకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దాసరి మూర్తి అన్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని మెండోరా మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కుల గణనను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేయడం బీసీల విజయం అని పేర్కొన్నారు. దేశంలోని ఓబీసీలకు ఈ తీర్పు ఎంతో ఆనందాన్ని కలిగించిందని ఆయన తెలిపారు. జనగణనలో కులాల లెక్కింపుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం సంక్షేమ పథకాల సమర్థ అమలుకు దోహదపడుతుందని చెప్పారు. ఈ...