మెండోరా: మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బడాల సాయరెడ్డి మాట్లాడుతూ దేశ అభివృద్ధికి రాజీవ్ గాంధీ చేసిన సేవలను స్మరించుకున్నారు. భారతదేశంలో సాంకేతిక విప్లవానికి పునాది వేసిన నాయకుడిగా, యువతకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని చేరువ చేసిన దూరదృష్టి కలిగిన ప్రధానిగా ఆయన చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వేల్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కొత్తింటి ముత్యంరెడ్డి, జిల్లా కార్యదర్శి నోముల శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ బుట్టడి ప్రమోద్ కుమార్, ఉప సర్పంచ్ మిట్టపల్లి రాజేశ్వర్, మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.