దూదిగాంలో దంత వైద్య శిబిరం ప్రారంభం
మెండోరా:మెండోరా మండలంలోని దూదిగాం గ్రామంలో మంగళవారం దంత వైద్య శిబిరం ప్రారంభమైంది. గ్రామ ప్రజలకు మెరుగైన దంత వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు గ్రామ సర్పంచ్ బాబా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దంత సమస్యలకు వైద్యుల సూచనలు, చికిత్సలు పొందాలని కోరారు. శిబిరంలో దంత పరీక్షలు, అవసరమైన సలహాలు, చికిత్సలు ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. ముప్కాల్ కు చెందిన లక్ష్మీ దంత వైద్యశాల డాక్టర్ ప్రశాంత్ కుమార్ ఆధ్వర్యంలో దూదిగాం గ్రామపంచాయతీ కార్యాలయంలో ఈ శిబిరం నిర్వహించబడింది. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై శిబిరాన్ని...