ఆర్మూర్ పట్టణంలోని మేరు కులస్తుల పిల్లలకు మేవా ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు అందజేత…

ఆర్మూర్: ఆర్మూర్ మేరు పట్టణ సంఘం భవనంలో జరిగిన మేవా ఆధ్వర్యంలో మేరు కుల విద్యార్థిని, విద్యార్థులకు ప్రతిభ అవార్డుల మహోత్సవము ఘనంగా నిర్వహించడం జరిగింది .ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి ఆర్మూర్ పట్టణ మున్సిపల్ చైర్ పర్సన్ గోనె లహరి హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు పై చదువులు చదివి మంచి ఉద్యోగంలో స్థిరపడాలని,మేరు కులానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని సూచించారు.స్థానిక కౌన్సిలర్ తిరుమల సుమన్, మరియు లైఫ్ హాస్పిటల్ అధినేత డాక్టర్ రామగిరి భాను  పిల్లలను ఉద్దేశించి మంచి సందేశాన్ని ఇస్తూ, విద్యార్థులకు తనవంతుగా 12,500 రూపాయలను విద్యార్థులకు అందజేయడం జరిగింది.భాషిత సుందర్  విద్యార్థులకు సర్టిఫికెట్ ఫైల్లను,స్నాక్స్...